రాజమండ్రిలో హోటల్ మంజీరాకు చేరుకున్న నారా లోకేశ్, పవన్ కల్యాణ్

  • రాజమండ్రిలో నేడు టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశం
  • పొత్తు కుదిరిన తర్వాత తొలిసారి సమావేశమవుతున్న టీడీపీ, జనసేన అగ్రనేతలు
  • రాజమండ్రి మంజీరా హోటల్ లో కీలక సమావేశం
రాజమండ్రిలో ఇవాళ టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ భేటీ ఏర్పాటు చేశారు. మరో ఐదు నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఈ పొత్తు సమావేశం జరగనుండడం, ఈ కీలక భేటీకి నారా లోకేశ్, పవన్ కల్యాణ్ వంటి అగ్రనేతలు హాజరవుతుండడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమన్వయ కమిటీ సమావేశం కోసం నారా లోకేశ్, పవన్ కల్యాణ్ కొద్దిసేపటి కిందటే రాజమండ్రిలోని హోటల్ మంజీరాకు చేరుకున్నారు. 

ఈ సమావేశానికి టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన 12 మంది కమిటీ సభ్యులు హాజరవుతున్నారు. పొత్తు నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్లాలి, ఉమ్మడి కార్యాచరణ, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన విషయాలు... తదితర అంశాలపై నేటి సమావేశంలో చర్చించనున్నారు. ఇటీవల ఇరు పార్టీల మధ్య పొత్తు కుదిరాక నిర్వహిస్తున్న తొలి సమావేశం ఇది.

TDP
Janasena
Nara Lokesh
Pawan Kalyan
Coordination Committee
Hotel Manjeera
Rajahmundry

More Telugu News